Home  »  TV News  »  మెల్ బోర్న్ లో బిత్తిరి సత్తి.. తగ్గేదేలే!

Updated : Jun 14, 2023

కావలి రవి కుమార్.. బహుశా ఈ పేరు ఎవరికి తెలియకపోవచ్చు. కానీ బిత్తిరి సత్తి అందరికి తెలిసిన పేరు. బిత్తిరి సత్తి అసలు పేరు కావలి రవి కుమర్. ఇతను తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం సామెన గ్రామంలో జన్మించాడు. బిత్తిరి సత్తి పేరు వినగానే అచ్చమైన పల్లెటూరి యాస పదాలు మాట్లాడే వ్యక్తిగా అందరికి గుర్తొస్తాడు.

సీమ శాస్త్రి, రుద్రమదేవి, గౌతమ్ నంద, విజేత, నేనే రాజు నేనే మంత్రి, రాజా ది గ్రేట్, సీత, బ్రోచేవారెవరురా, గమనం, సత్తి గాని రెండెకరాలు, అన్ స్టాపబుల్ వంటి సినిమాల్లో నటించిన బిత్తిరి సత్తి.. 2019 లో విడులైన 'తుపాకి రాముడు' సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. అయితే 'నేనే రాజు నేను మంత్రి' సినిమాలో తనకి మంచి సపోర్టింగ్ పాత్ర లభించి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఎన్నో పంచ్ లతో కామెడీ పండిస్తూ యాసని కలిపేస్తూ అందరిని నవ్విస్తున్నాడు బిత్తిరి సత్తి.

'చేవేళ్ళలో ఇలా బిత్తిరి గా ఉండే ఇద్దరిని బాగా పరిశీలించి క్రమంగా తను కూడా దానికి అలవాటు పడి అలా మాట్లాడుతూ ఉంటే.. వాళ్ళ ప్రెండ్స్ సర్కిల్ లో తనకి మంచి క్రేజ్ ఏర్పడి పలు షోస్ లో యాక్ట్ చేయమని చెప్పగా, హైదరాబాద్ వచ్చిన బిత్తిరి సత్తి.. మొదటగా సినిమాలలో ప్రయత్నించగా అవకాశాలు రాలేదు. దాంతో ఒక న్యూస్ ఛానెల్ లో వార్తలు చదివే అవకాశం రావడంతో దానిని సద్వినియోగం చేసుకున్నాడు. అలా క్రమంగా తన వాక్చాతుర్యంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు బిత్తిరి సత్తి.

అయితే ప్రస్తుతం భోళా శంకర్ మూవీలో నటిస్తున్నాడు బిత్తిరి సత్తి. కాగా అతను ప్రతీ విషయాన్ని సామజిక మాధ్యమం ద్వారా తెలియజేస్తుంటాడు. అలాగే తనకి ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అందులో రెగ్యులర్ గా వ్లాగ్ లు చేస్తుండగా వాటికి అత్యధిక వీక్షకాధరణ లభిస్తుంది. అయితే బిత్తిరి సత్తి తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ కి వెళ్లాడు. అక్కడ ఒక వ్లాగ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా ఆ వీడియో చూసినవాళ్ళంతా.. సూపర్ సత్తి, నీ భాష వింటే మన పల్లె యాదికొస్తుందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు‌. కాగా ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.